మత ప్రచారకులపై పేడనీళ్లు పోసిన యువకుడు
07-02-2020 11:38:50
మచిలీపట్నం: అన్యమత ప్రచారంపై కృష్ణా జిల్లా గూడూరులో ఓ యువకుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో సదరు ప్రచారకులపై పేడ నీళ్లు కుమ్మరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ... మత ప్రచారకులు గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేడ నీళ్లు పోసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా.. అవి పేడ నీళ్లు కాదని.. నీళ్లు మాత్రమేనని చెప్పాడు. ప్రచారం చేయొద్దని గతంలో చాలా సార్లు చెప్పానని.. అయినా వినకుండా మత ప్రచారం చేస్తున్నారని.. అందుకే నీళ్లు పోశానన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Post a Comment