ఢిల్లీ అల్లర్లు: ట్రంప్‌ను కడిగిపారేసిన శాండర్స్
వాషింగ్టన్: ఇటీవల భారత పర్యటనకు వచ్చి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా సెనేటర్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ శాండర్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత పర్యటన సమయంలో చోటుచేసుకున్న ఢిల్లీ అల్లర్లను ఉద్ధేశించి ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయన నిప్పులు చెరిగారు. ట్రంప్ ‘‘నాయకత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనం’’ అంటూ దుయ్యబట్టారు. తన భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ అల్లర్లు చోటు చేసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఈ విషయంపై నేను మోదీతో చర్చించలేదు. అది భారత అంతర్గత వ్యవహారం కాబట్టి నేను మాట్లాడను..’’ అని పేర్కొన్నారు.
దీనిపై ట్విటర్ వేదికగా శాండర్స్ స్పందిస్తూ... ‘‘భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ముస్లిం వ్యతిరేక దాడుల కారణంగా 27 మంది వరకు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. కానీ ట్రంప్ మాత్రం ‘అది భారత అంతర్గత వ్యవహారం..’ అని పేర్కొన్నారు. మానవ హక్కుల విషయంలో ఇది కచ్చితంగా నాయకత్వ వైఫల్యమే..’’ అని వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై డెమొక్రాటిక్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి, సెనేటర్ ఎలిజబెత్ వారెన్ స్పందించగా.. ఇదే అంశంపై స్పందించిన రెండో డెమెుక్రాటిక్ అభ్యర్థిగా శాండర్స్ నిలిచారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థులతో పాటు ఇతర సెనేటర్లు కూడా బుధవారం వెలుగుచూసిన ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment