జనగణనతోపాటు ఎన్పీఆర్
రెండు దశల్లో సేకరణ
మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం
రాష్ట్రస్థాయి సమీక్షలో డైరెక్టర్ సత్యనారాయణ
రెండు దశల్లో సేకరణ
మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం
రాష్ట్రస్థాయి సమీక్షలో డైరెక్టర్ సత్యనారాయణ
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జనగణన-2021తోపాటు జాతీయ జనాభా పుస్తక (ఎన్‌పీఆర్) నవీకరణ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 తేదీ నుంచి ప్రారంభిస్తామని జనగణన రిజిస్ర్టేషన్ డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో సాగుతుందని చెప్పారు. జనగణన కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించామన్నారు. ప్రయోగాత్మకంగా విజయనగరం (భోగాపురం మండలం), అనంతపురం (ఆత్మకూరు మండలం), గుంటూరు (నరసరావుపేట మండలం) జిల్లాల నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకుని విజయవంతంగా వివరాలు నమోదు చేశామని చెప్పారు.
అమరావతి సచివాలయంలో బుధవారం జనాభా గణన-2021పై నోడల్ అధికారులు, కార్యదర్శులు, ముఖ్య గణాంక అధికారులతో రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనగణన కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనగణన 2021తోపాటు జాతీయ జనాభా రిజిస్ట్రర్‌ను నవీనకరిస్తారని తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో 45 రోజులపాటు మొదటి దశలో ఇంటి గణన, గృహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తామన్నారు. రెండో దశలో ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు 2021 జనాభా వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ ఉంటుందన్నారు. జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బంది బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా గౌరవ వేతనం వేస్తామని చెప్పారు. జనగణన సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుందని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి చెప్పారు. జనగణనకు అవసరమైతే గ్రామ, వార్డు వాలంటీర్ల సాయం కూడా తీసుకోవచ్చన్నారు. జనగణనలో వ్యక్తులతోపాటు సాంఘిక, సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థికపరమైన వివరాలను సేకరిస్తారని అడిషనల్ రిజిస్టార్ జనరల్ సంజయ్ చెప్పారు.
ఎన్యుమేటర్లు మొబైల్ యాప్‌తోపాటు వివరాలు నమోదు కాగితపు దరఖాస్తులను నింపడం ద్వారా వివరాలను సేకరిస్తారన్నారు. వివరాల నమోదుకు 34 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని రూపొందించామని జాయింట్ డైరెక్టర్ షిసుకుమార్ తెలిపారు. ఎన్పీఆర్ కన్నా ఎక్కువ వివరాలు జనగణనలో సేకరిస్తామన్నారు. ప్రతి 120-150 ఇళ్లను ఒక బ్లాక్‌గా నిర్ణయించి ఎన్యుమరేటర్‌ను నియమించనున్నట్టు చెప్పారు.
No comments:
Post a Comment