రాజ్యాంగ స్ఫూర్తితోనే సీఏఏ
07-02-2020 02:56:44
కాంగ్రెస్, వామపక్షాలు, కుహనా లౌకికవాదులు, అర్బన్ నక్సల్స్ కు ఆర్టికల్ 10 గురించి తెలియదా? సీఏఏ ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుందంటూ వస్తోన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీం కోర్టు ఇచ్చిన 20 తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. 1959 కేసుకు సంబంధించి ఒక పరిశీలనను ఈ సందర్భంగా ప్రస్తావించాలి.‘కొన్ని ప్రత్యేక పరిస్థితులు లేదా కారణాలతో, ఒకవేళ ఏదైనా చట్టం ఇతరులకు కాకుండా కేవలం ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తున్నప్పటికీ, అది రాజ్యాంగబద్ధం అవుతుంది. ఆ ఏకైక వ్యక్తిని ఒక ప్రత్యేక తరగతిగా పరిగణింపవచ్చు.’
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM
పౌరసత్వ సవరణ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటి నుంచి కాంగ్రెస్, వామపక్షాలు,ఉదారవాదులు, కుహనాలౌకికవాదులు,అర్బన్ నక్సలైట్లు, అల్లరిచిల్లరి మూకలు దేశాన్ని అస్థిర పర్చి దేశ సమైక్యత, సమగ్రతకు విఘాతం కలిగించేటందుకు హింసోన్మాదక నిరసనలు కొనసాగిస్తున్నాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా దేశంలో అత్యవసర స్థితి సృష్టించే నైపుణ్యం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోసం తహతహలాడుతోన్న ఆ పార్టీ సీఏఏను ఉపయోగించుకొని తమ నైపుణ్యానికి పదును పెడుతోంది.
దీనిపై మీడియాలో ప్రసారమవుతోన్న వార్తలు, పతాక శీర్షికలు, సంపాదకీయాలు, డిబేట్లలో చాలావరకు వక్రభాష్యాలు, అవాస్తవాలే ఉన్నాయి. సీఏఏ దేశ లౌకికతత్వాన్ని దెబ్బతీసిందని, ముస్లిం అనే పదం చేర్చక ఆర్టికల్ 14ను విఘాతపర్చిందని, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌ల నుండి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులను ఎందుకు చేర్చలేదని, అస్సాం ఒప్పందానికి తూట్లు పొడిచిందని, పౌరసత్వ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఇప్పుడు ఏముందంటూ విపక్షాలు, మీడియా అసంబంద్ధమైన ప్రశ్నలు రేకెత్తిన్నాయి.
విస్తృతమైన సంప్రదింపులు జరపకుండా, దీర్ఘాలోచన చేయకుండా బీజేపీ ఏదీ చేయదు. సీఏఏ దేశ విభజన నాటిది. నాడు జిన్నా దేశ విభజనకు దారితీసేలా రెండు తీవ్రమైన ప్రకటనలు చేశారు. మొదటిది, 1941లో కాన్పూర్‌లో మాట్లాడుతూ తాము ఆధిక్యతలో ఉన్న ప్రాంతాల్లోని ఏడు కోట్ల ముస్లింలను బంధ విముక్తులను చేసేందుకు ఎంతటి తీవ్ర పరిస్థితులనైనా ఎదుర్కొంటామని, అవసరమైతే రెండు కోట్ల ముస్లింల ప్రాణాలతో చెలగాటమాడటానికి కూడా వెనుకాడమని చెప్పారు. మరో సందర్భంలో, శాసనసభ్యుల సదస్సులో మాట్లాడుతూ గ్లాడ్‌స్టోన్ పాలనలో మైనారిటీల రక్షణ పేరుతో ఆర్మేనియాలో బ్రిటన్ జోక్యం చేసుకోగా లేనిది, ఇప్పుడు హిందుసన్‌లో మైనారిటీలు అణచివేతకు గురవుతున్నప్పుడు జోక్యం చేసుకునే హక్కు మనకెందుకు ఉండదని ప్రశ్నించారు.
దేశ విభజన హింసాత్మక రూపం దాల్చిన సమయంలో పాకిస్థాన్‌లో హిందూ మైనారిటీలు ఎప్పుడైనా భారత్‌కు వచ్చి స్థిరపడాలనుకొంటే వారికి ఆశ్రయం కల్పిస్తామని జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 1950 ఏప్రిల్ లో ‘నెహ్రూ – లియాఖత్’ ఒప్పందం కుదిరింది. అయితే, అంతకుముందు 1949 ప్రారంభంలో పాక్ రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో తమ దేశం ఇస్లాం రాజ్యంగా ఉండాలన్న తీర్మానానికి మద్దతు తెలిపిన లియాఖత్ పాలనలో మైనార్టీలు సురక్షితంగా ఉండగలరన్న దానిపై అనుమానాలతో నెహ్రూ తక్షణ యుద్ధం నివారించడానికి ఆ ఒప్పందంపై సంతకం పెట్టారు.
1955లో మొదటిసారి భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టం తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950, నాటి ననుంచీ 1955 మధ్య కాలంలోనూ అనేక మందికి భారత్ పౌరసత్వం కల్పించింది. అయితే, ఏ చట్టం కింద వీరికి పౌరసత్వం కల్పించారు? పౌరసత్వం కల్పించే ఈ పక్రియలో వారి వలస హోదా (శరణార్థి లేదా అక్రమ వలసదారులు లేదా చొరబాటుదారులు), భారత సంతతికి చెందినవారా కాదా, నాచురలైజేషన్ రిక్వైర్‌మెంట్, ఆర్టికల్ 14 ఉల్లంఘన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా? అప్పటికి భారత్ ఐక్యరాజ్యసమితి శరణార్ధుల సదస్సు, 1951పై సంతకం చేయలేదు. నాడు దేశంలో పౌరసత్వం కల్పించే చట్టాలు లేవు కానీ, దేశ బహిష్కరణ చట్టాలు ఉన్నాయి.
పౌరసత్వ చట్టం, 1955 చేసిన 30 ఏళ్ళకు 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టానికి మొదటి సవరణ తీసుకొచ్చింది. అస్సాంలో అక్రమంగా వలస వచ్చిన ముస్లింలకు అవకాశం కల్పించేందుకే నాటి కాంగ్రెస్ సర్కార్ ఈ సవరణ తీసుకొచ్చింది. అయితే శరణార్థులు దేశం అంతటా వ్యాపించి ఉండగా, అస్సాంకు మాత్రమే వర్తించే విధంగా ఈ సవరణ తీసుకురావడం దురదృష్టకరం, అసంబద్ధం. కానీ, పౌరసత్వం కోసం గళమెత్తుతోన్న ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో మతహింసను ఎదుర్కొని భారత్‌లో ఆశ్రయం పొందుతున్న అక్కడి మైనార్టీలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇదొక తప్పిదం.
పౌరసత్వ సవరణ చట్టం, 1985 ప్రజల రాత మార్చిందా? విదేశీయులు (ట్రిబ్యునల్ ఆర్డర్, 1964) చట్టం కింద ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ 62,000 మంది అక్రమ వలసదారులను గుర్తించాయి. అయితే, రికార్డుల ప్రకారం వారిలో 2400 మందిని మాత్రమే తిరిగి పంపగలిగారు. అస్సాం ఒప్పందం, 1985 లోని క్లాజ్ 6 ప్రకారం ఏర్పాటు చేయాల్సిన కమిటీకి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు మోక్షం కలగలేదు. ఏనాడూ అమలుకు నోచుకోని 1950 నాటి ‘‘నెహ్రూ–-లియాఖత్’’ ఒప్పందానికి శాసన హోదాని సీఏఏ ద్వారా మోదీ ప్రభుత్వం కల్పించింది. ఈ చట్టం ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో వేధింపులకు గురైన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శి, క్రైస్తవ శరణార్థుల పౌరసత్వం కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తుందే తప్ప కొన్ని స్వార్థ శక్తులు ప్రచారం చేస్తున్నట్లుగా ఇది ఎవరి పౌరసత్వాన్నీ రద్దు చేయదు.
కాంగ్రెస్, వామపక్షాలు, కుహనా లౌకికవాదులు, అర్బన్ నక్సల్స్‌కు ఆర్టికల్ 10 గురించి తెలియదా? సీఏఏ ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుందంటూ వస్తోన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీం కోర్టు ఇచ్చిన 20 తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. రామ్ కృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ ఎస్.ఆర్.టెండూల్కర్, 1959 కేసులో ‘కొన్ని ప్రత్యేక పరిస్థితులు లేదా కారణాలతో, ఒకవేళ ఏదైనా చట్టం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తున్నప్పటికీ, అది రాజ్యాంగబద్ధం అవుతుంది. ఆ ఏకైక వ్యక్తిని ఒక ప్రత్యేక తరగతిగా పరిగణింపవచ్చు.’ అన్నది.
పౌరసత్వం పొందడానికి ఉన్న ఐదు మార్గాలతో పోలిస్తే సీఏఏ ద్వారా పౌరసత్వం పొందడం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దీనికి డిసెంబర్ 31, 2014ను ఆఖరి గడువుగా నిర్ణయించారు. నిర్దిష్ట తేదీ అనంతరం ఈ మార్గంలో పౌరసత్వం కోరేవారు ఉండరు. సీఏఏ లో పేర్కొన్న రక్షణలు అస్సాం ఒప్పందానికి విఘాతం కలిగించవని కేంద్ర హోం మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో మతపరంగా జనాభా నిష్పత్తి మారే అవకాశం లేదు. అటు లౌకికవాదాన్నీ ఉల్లంఘించదు. సీఏఏను అమలు చేయబోమంటూ కేరళ పశ్చిమబెంగాల్ వంటి బీజేపీయేతర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అయితే, ఇవి దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు తూట్లు పొడుస్తున్న విషయాన్ని మర్చిపోతున్నాయి.
కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఆర్టికల్ 370ని జోడించారు. ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకశ్మీర్ పునరావాస చట్టం 1982లో వచ్చింది. దీని ప్రకారం భారతదేశ విభజన తర్వాత, 1947 నుండి 1954 వరకు పాకిస్థాన్‌కు వలస వెళ్లిన పాకిస్థానీ జాతీయులకు కశ్మీర్ కు వచ్చి పునరావాసం పొందే అధికారం కల్పిస్తుంది. పౌరసత్వ చట్టం, 1955కు సమాంతరంగా తీసుకొచ్చిన ఈ చట్టం దేశ భద్రత, జాతీయ సమగ్రత విషయంలో రాజీ పడింది. ఎమర్జెన్సీ కాలంలో భారత రాజ్యాంగ పీఠికలో లౌకికవాదం, సామ్యవాదం అనే పదాలను జోడిస్తూ కాంగ్రెస్ ఒక సవరణ తీసుకొచ్చింది.
ఇంతటి కీలకమైన రాజ్యాంగ సవరణపై ఏ మేరకు చర్చలు జరిగాయి? పసీఏఏ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తీసుకొచ్చిన చట్టమైనా కాంగ్రెస్ దాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తుంది. రాజ్యాంగ నిర్మాతల కలలు, ఆశయాలు, ఆకాంక్షల మేరకే మోదీ ప్రభుత్వం చట్టాలు రూపకల్పన చేస్తుంటే కాంగ్రెస్ కూటమి, కుహనా లౌకికవాదులు రాజ్యాంగానికి వక్రభాష్యం చెప్తున్నారు.
ప్రజల న్యాయవాది, అమెరికా సుప్రీం కోర్టులో గౌరవనీయ అసోసియేట్ న్యాయమూర్తి లూయిస్ డి బ్రాండేయ్స్ ఒక సామాన్య పౌరుడిని అత్యంత ముఖ్యమైన రాజకీయ శక్తిగా అభివర్ణించారు. అటువంటి రాజకీయ శక్తులను గుర్తించే ప్రక్రియను కాంగ్రెస్ ఒక విపత్తుగా పేర్కొంది. దేశ భద్రత, జాతీయ సమగ్రత, పౌర రక్షణ ప్రాతిపదికగా కేంద్రం తెచ్చిన ఈ అద్భుతమైన పౌరసత్వ సవరణ చట్టం సర్వజనులకు ఆమోదనీయం.
చింతా సాంబమూర్తి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సఫాయి కర్మచారి కమిషన్ మాజీ సభ్యులు, భారత ప్రభుత్వం

No comments:
Post a Comment