Thursday, March 12, 2020

ఏ పత్రాలూ ఇవ్వక్కర్లేదు ఎన్‌పీఆర్‌పై అమిత్‌ షా

ఏ పత్రాలూ ఇవ్వక్కర్లేదు
ఎన్‌పీఆర్‌పై రాజ్యసభలో అమిత్‌ షా

న్యూఢిల్లీ, మార్చి 12: జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) కోసం ఎటువంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఎవర్నీ అనుమానితులు(డౌట్‌ఫుల్‌ -‘డి’)గా ప్రకటించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్లపై గురువారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘ఎన్‌పీఆర్‌ కోసం ఏ పత్రాలూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు వారి దగ్గర ఏ సమాచారం ఉంటే అది ఇస్తేచాలు. మిగతా ప్రశ్నలను ఖాళీగా వదిలేయొచ్చు’’ అని వివరించారు.

‘డి’ని తొలగిస్తారా అన్న కాంగ్రెస్‌ సభ్యులు ప్రశ్నించగా అమిత్‌ షా బదులిచ్చారు. ‘‘ఎన్‌పీఆర్‌ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎన్‌పీఆర్‌ను తాజాపరిచే ప్రక్రియలో ఎవర్నీ అనుమానితులుగా మార్కు చేయబోము’’ అని తెలిపారు. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను చేపట్టేది లేదని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించిన తెలిసిందే. ఎన్‌పీఆర్‌లో ప్రశ్నలకు ప్రజలు సమాధానాలు ఇవ్వకపోతే ఆ ఇళ్లకు ‘డి’ ముద్ర వేస్తారన్న భయాలూ ఉన్నాయి. ఢిల్లీలో హింస, అల్లర్ల బా ధ్యులను కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంఽధం లేకుండా శిక్షిస్తామన్నారు. విధ్వంసానికి పాల్పడిన 1,922 మందిని ఫేషియల్‌ ఐడెంటిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించామన్నారు. వారి నుంచి నష్ట పరిహారం రాబడతామన్నారు.

ఎన్పీఆర్‌పై అమిత్‌షా తాజా ప్రకటన
న్యూఢిల్లీ : ఎన్పీఆర్‌పై కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్‌షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే లేదని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ జాబితాలో ‘సందేహాస్పద’ (డి) అనే కేటగిరీ ఉండదని ప్రకటించారు. ఎన్పీఆర్ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.

ఈ విషయంపై ఎవరికైనా సందేహముంటే, వాటిని తీర్చడానికి కేంద్ర హోంశాఖా సదా సిద్ధంగానే ఉందని ఆయన ప్రకటించారు. సీఏఏ విషయంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సీఏఏతో ఎవరి పౌరసత్వం రద్దు కాదని, పైగా పౌరసత్వం లభిస్తుందని అమిత్‌షా తెలిపారు. 

No comments:

Post a Comment