Modi: తమిళనాడు నుంచి మోదీ పోటీ!
ABN , First Publish Date - 2023-01-08T01:10:57+05:30 IST
దక్షిణాదిపై గురిపెట్టిన ప్రధాని మోదీ.. తమిళనాడు నుంచి పోటీ చేయనున్నారా? దక్షిణాది నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు కసరత్తు ప్రారంభించారా? ఈ నెల మూడో వారం నుంచి మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టి.. ఉధృత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారా?...
Modi: తమిళనాడు నుంచి మోదీ పోటీ!
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్
సం|| 93979 79750
లేదంటే అమిత్‌షాకు అవకాశం
రామనాథపురం సెగ్మెంట్ నుంచి చాన్స్
Powered By
VDO.AI
జాతీయ కార్యవర్గంలో కీలక చర్చ!!
న్యూఢిల్లీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిపై గురిపెట్టిన ప్రధాని మోదీ.. తమిళనాడు నుంచి పోటీ చేయనున్నారా? దక్షిణాది నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు కసరత్తు ప్రారంభించారా? ఈ నెల మూడో వారం నుంచి మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టి.. ఉధృత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారా? ఈ ప్రశ్నలకు జాతీయ కార్యవర్గంలోని ముఖ్యులు అవుననే చెబుతున్నారు. రాబోయే మోదీ ప్రచారంపై ప్రస్తుతం జాతీయ కార్యవర్గంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ప్రధాని పూర్తిస్థాయిలో దక్షిణాదిపై దృష్టిని కేంద్రీకరించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ, అమిత్ షాల్లో ఇద్దరూ లేదా ఒక్కరు తమిళనాడు నుంచి పోటీచేసే అవకాశాలపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని రామనాథపురం నుంచి ఇద్దరిలో ఒకరు పోటీచేసే అవకాశాలున్నాయని అంటున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న కర్ణాటక, తెలంగాణలపై మోదీ సీరియ్‌సగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మోదీ స్వయంగా ప్రచార సారథిగా వ్యవహరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జాతీయ కార్యవర్గంలోనూ ఇదే కీలకం?
ఢిల్లీలో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ దక్షిణాది అంశం కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా వ్యూహరచన జరుగుతుందని, దక్షిణాదిలో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయని సమాచారం. ఈ సమావేశాల తర్వాత తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుకు సంబంధించి పార్టీ నిర్మాణానికి, సంస్థాగత మార్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు జరుగుతాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తెలంగాణ, కర్ణాటకల్లో అసెంబ్లీలో విజయం సాధించడంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిందని, సార్వత్రక ఎన్నికల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ ప్రధాని మోదీ సాఽధ్యమైనన్ని సీట్లు సాధించేందుకు సన్నాహాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగానే స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో ‘కాశీ-తమిళ సంగమం’ను మోదీ వారాణసీలో ప్రారంభించారని, దక్షిణాది-ఉత్తరాది మఽధ్య హద్దులు చెరిపేసి, బీజేపీ విస్తరించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
బడ్జెట్ తర్వాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
తొమ్మిది రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరగనున్నాయని ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి ఒకరు లేదా ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దొరకనుందని తెలుస్తోంది. అయితే.. జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత.. ప్రధాని మోదీ షెడ్యూల్ బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండదనే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాతే మోదీ కేబినెట్ విస్తరణ/మార్పులు-చేర్పులు ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment